Skip to main content

యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్

అమెరికాలోని ప్రఖ్యాత డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్‌రావు ఎన్నికయ్యారు.
వైట్‌హౌస్‌లోని రూస్‌వెల్ట్ రూమ్‌లో యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ నేతృత్వంలో ఆమె మార్చి 21న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018, నవంబర్‌లో నియోమీని జడ్జిగా నామినేట్ చేయగా ఆమె నియామకానికి 53-46 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది. నియోమీ గతంలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్‌ఏ)లో అడ్మినిస్ట్రేటర్‌గా కీలక పాత్ర పోషించారు. డీసీ కోర్టు జడ్జిగా నియమితులైన భారతీయుల్లో నియోమీ రెండో వ్యక్తి. గతంలో శ్రీ శ్రీనివాసన్ అనే వ్యక్తి డీసీ కోర్టు జడ్జిగా వ్యవహరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : నియోమీ జహంగీర్‌రావు
ఎక్కడ : కొలంబియా, అమెరికా
Published date : 22 Mar 2019 04:40PM

Photo Stories