Skip to main content

యూఎస్ ఓపెన్‌లో కబాల్-ఫరా జంటకు టైటిల్

యూఎస్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో టాప్ సీడ్ యువాన్ సెబాస్టియన్ కబాల్-రాబర్ట్ ఫరా (కొలంబియా) జంటకు పురుషుల డబుల్స్ టైటిల్ లభించింది.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 6న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కబాల్-ఫరా ద్వయం 6-4, 7-5తో ఎనిమిదో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)-హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. విజేత కబాల్-ఫరా జంటకు 7,40,000 డాలర్ల (రూ. 5 కోట్ల 30 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యూఎస్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : యువాన్ సెబాస్టియన్ కబాల్-రాబర్ట్ ఫరా (కొలంబియా) జంట
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 07 Sep 2019 05:26PM

Photo Stories