Skip to main content

యూఎన్‌సీసీడీ సీఓపీ 14వ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నదేశాధినేత?

ఎడారీకరణ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్వహిస్తున్న పార్టీల సమాఖ్య (యూఎన్‌సీసీడీ సీఓపీ) 14వ సెషన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. జూన్ 14న నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ... వర్చువల్‌ విధానం ద్వారా పాల్గొని ప్రసంగించనున్నారు.
Current Affairs
ఎడారీకరణ, భూ క్రమక్షయం అనే అంశాలపై ఆయన ప్రత్యేక సందేశం ఇస్తారని జూన్ 11న ఐరాస వెల్లడించింది.పర్యావరణ ఆరోగ్యం, ఆకలి లేని సమాజం,, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యాలని.. వాటిని 2030 సుస్థిరాభివృద్ధి అజెండాగా భావిస్తున్నట్లు తెలిపింది. ఎడారీకరణపై ఐరాస పార్టీల కాన్ఫరెన్స్‌ 14వ సెషన్‌ను ప్రధాని మోదీ 2019 సెప్టెంబర్‌లో ఢిల్లీలో ప్రారంభించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : జూన్ 14న నిర్వహిస్తున్న యూఎన్‌సీసీడీ సీఓపీ 14వ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నదేశాధినేత?
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్‌ విధానంలో
ఎందుకు:ఎడారీకరణ, భూ క్రమక్షయం అనే అంశాలపై చర్చలు జరిపేందుకు...
Published date : 12 Jun 2021 06:52PM

Photo Stories