Skip to main content

యూఎన్‌ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితులుకానున్న వ్యక్తి?

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్‌ భద్రతా మండలి సిఫారసు చేసింది.
Current Affairs యూఎన్‌ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియాకే అవకాశం ఇవ్వాలని జూన్ 8న జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గుటెరస్‌ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా రెండోసారి... 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్‌ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్‌ భద్రతామండలి తీర్మానాన్ని స్వాగతించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితులుకానున్న వ్యక్తి?
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : ఆంటోనియా గుటెరస్‌
ఎందుకు : నియమించాలని యూఎన్‌ భద్రతా మండలి సిఫారసు మేరకు...
Published date : 09 Jun 2021 07:35PM

Photo Stories