యోగా శిక్షకురాలు నానమ్మాళ్ కన్నుమూత
Sakshi Education
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) వృద్ధాప్యం కారణంగా అక్టోబర్ 26న కన్నుమూశారు.
నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్‌స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్‌ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ యోగా శిక్షకురాలు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : వి. నానమ్మాళ్ (99)
ఎక్కడ : కోయంబత్తూరు, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ యోగా శిక్షకురాలు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : వి. నానమ్మాళ్ (99)
ఎక్కడ : కోయంబత్తూరు, తమిళనాడు
Published date : 28 Oct 2019 05:34PM