Skip to main content

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ ప్రారంభం

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూలై 30) పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్‌లు సంయుక్తంగా జూలై 30న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్‌ను ప్రారంభించాయి.
Current Affairs
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్‌లో ప్రసంగిస్తూ.. మానవ అక్రమ రవాణా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా... ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

రెడ్‌రోప్ స్వచ్ఛంద సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ల సహకారంతో ఏపీ మహిళా కమిషన్ జూలై 30న నిర్వహించిన వెబినార్‌లో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు. మరోవైపు ‘చైల్డ్ లైన్-1098, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్’ ఆధ్వర్యంలో బాలలను, మహిళలను అప్రమత్తం చేస్తూ రూపొందించిన పోస్టర్‌ను, చైల్డ్‌లైన్-1098 లోగోతో కోవిడ్ మాస్క్‌లను ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆవిష్కరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ ప్రారంభం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్
ఎందుకు : ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూలై 30) పురస్కరించుకుని
Published date : 01 Aug 2020 12:58PM

Photo Stories