వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం
Sakshi Education
కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం జనవరి 31న చైనాలోని వూహాన్‌లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్‌ను సందర్శించింది.
2019 ఏడాదిలో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. ఈ మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వూహాన్‌లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్ సందర్శన
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం
ఎక్కడ : వూహాన్, చైనా
ఎందుకు : కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు

Published date : 05 Feb 2021 06:11PM