వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ గ్రూప్‌లో చేరిన దేశాలు?
Sakshi Education
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల అవకాశాలను పెంచేందుకు ఉద్దేశించిన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ (డబ్ల్యూఎల్‌పీ) గ్రూప్‌లో భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు చేరాయి.
భారత్‌లోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైయినర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గో తమ భాగస్వాములుగా ఉంటాయని డబ్ల్యూఎల్‌పీ ఫిబ్రవరి 3న పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్ భాస్కరన్ ఉన్నారు.
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ కసరత్తు చేస్తోంది. కొలంబియా, సెనెగల్, కజక్‌స్థాన్, బ్రెజిల్, ఉరుగ్వే తదితర దేశాలు ఇప్పటికే ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ (డబ్ల్యూఎల్‌పీ) గ్రూప్‌లో చేరిక
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా
ఎందుకు : వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల అవకాశాలను పెంచుకునేందుకు

Published date : 05 Feb 2021 06:10PM