Skip to main content

వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ సదస్సు

వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు సంబంధించిన దావోస్ ఎజెండా సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 28న ప్రసంగించారు.
Current Affairs
జనవరి 24 నుంచి 29 దాకా జరిగిన ఈ ఆన్‌లైన్ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక, పర్యావరణ, సామాజిక, సాంకేతిక సవాళ్లు, టీకాల ప్రక్రియ, ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిపారు.

సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్ సహకారం అందిస్తుందని అన్నారు. ‘చాలా దేశాలకు కోవిడ్ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు. దావోస్ నగరం స్విట్జర్లాండ్ దేశంలో ఉంది.

స్విట్జర్లాండ్ రాజధాని: బెర్న్; కరెన్సీ: స్విస్ ఫ్రాంక్
స్విట్జర్లాండ్ ప్రస్తుత అధ్యక్షుడు: గై పార్మెలిన్
స్విట్జర్లాండ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఇగ్నాజియో కాసిస్

క్విక్ రివ్యూ :

ఏమిటి : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దావోస్ ఎజెండా సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్
Published date : 01 Feb 2021 06:15PM

Photo Stories