వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో తెలంగాణ ఐటీ మంత్రి
Sakshi Education
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 12న జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ వార్షిక సమావేశంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డిజైనింగ్ రంగానికి పెరుగుతున్న ప్రాముఖ్యత దృష్ట్యా కేంద్ర పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డిప్) సహకారంతో హైదరాబాద్‌లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వివిధ సంస్థలకు డిజైన్ కన్సల్టెన్సీ సేవలు, సామర్థ్యం పెంపుదల, డిజైన్ ఎడ్యుకేషన్‌లో పెంపు లక్ష్యంగా ఈ కేంద్రం సేవలందిస్తుందన్నారు. అలాగే వివిధ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు, సేవలకు ‘బ్రాండింగ్’ ఇచ్చేందుకు ఈ సంస్థ దోహదం చేస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ వార్షిక సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ వార్షిక సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్
Published date : 14 Oct 2019 05:46PM