Skip to main content

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను న్యూఢి ల్లీలో ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ‘ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్’స్ఫూర్తికి వందే భారత్ రైలు ప్రతినిధి అని అన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల్లో రూపొందించిన ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్రయాణికులకు సేవలందించనుంది. ఫిబ్రవరి 17 నుంచి ప్రయాణికులకు అం దుబాటులోకి రానుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశేషాలు..
  • ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్ (ప్రయాగ్ రాజ్) స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
  • మొత్తం దూరం - 769 కిలోమీటర్లు.
  • ఢిల్లీ నుంచి బయల్దేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసికి 8 గంటల్లో చేరుకుంటుంది. సాధారణ రైళ్లలో మాత్రం 11.5 గంటల సమయం పడుతుంది.
  • మొత్తం 1,128 మంది రైలులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
  • గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది.
  • ప్రయాణించడానికి అనుమతించిన గరిష్ట వేగం - గంటకు 160 కిలోమీటర్లు
  • సోమ, గురువారాలు తప్ప వారంలో మిగిలిన ఐదు రోజులు నడపనున్నారు.
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల కాలంలో తయారుచేసింది. ఇందులో మొత్తం 16 బోగీలు ఉనాయి. అన్నీ ఏసీ బోగీలే.
  • వై-ఫై, ఆటోమేటిక్ తలుపులు, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, ప్రతికోచ్‌లోనూ ఆహార, పానీయాలు అందించే ఏర్పాట్లున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 16 Feb 2019 03:11PM

Photo Stories