Skip to main content

విశ్వభారతం గ్రంథాన్ని రచించిన వారు?

బ్రహ్మశ్రీ, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన సంస్కృత మహాకావ్యం ‘విశ్వభారతం’గ్రంథాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ ఆవిష్కరించారు.
Current Affairs
ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని అవధాన సరస్వతీ పీఠం ప్రాంగణంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

అభిబస్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం
ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో ఇక నుంచి బస్‌ టికెట్లను కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ఈ–టికెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అభిబస్, ఐఆర్‌సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది.

వార్తల్ని వాడుకుంటే..
ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు న్యూస్‌ మీడియా(సవరణ) బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ఫిబ్రవరి 25న ఏకగ్రీవంగా ఆమోదించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మశ్రీ, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన సంస్కృత మహాకావ్యం ‘విశ్వభారతం’గ్రంథావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌
ఎక్కడ : హైదరాబాద్‌
Published date : 26 Feb 2021 06:14PM

Photo Stories