Skip to main content

విశ్వ కవి సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న 39వ ‘విశ్వ కవి సమ్మేళనం’లో అక్టోబర్ 6న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సమాజంలో పరివర్తన కవిత్వంతో సాధ్యమవుతుందని, విశ్వశాంతికి బాటలు వేసేది సాహిత్యమని పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనం సందర్భంగా తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సిద్ధార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్థం) ఆవిష్కరణ జరిగింది.
 
 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ విశ్వ కవి సమ్మేళనాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. కళింగ సంస్థల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ సమ్మేళనంలో  82 దేశాల నుంచి 1,300 మంది కవులు పాల్గొన్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్కృతిక మరియు కళల సంస్థలో భాగమైన ఈ విశ్వ కవుల వేదిక (WCP) 1969లో ప్రారంభమైంది. ప్రస్తుతం  వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పొయెట్రీ అధ్యక్షుడిగా డాక్టర్ మారస్ యంగ్ ఉన్నారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : విశ్వ కవి సమ్మేళనానికి హాజరు
 ఎప్పుడు : అక్టోబర్ 6
 ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
 ఎక్కడ : కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ, భువనేశ్వర్, ఒడిశా
Published date : 07 Oct 2019 06:39PM

Photo Stories