విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు
Sakshi Education
విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు డిసెంబర్ 4న జరిగాయి.
ఈ వేడుకల్లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కె డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ ముఖ్య అతిథి సీఎం జగన్‌కు స్మృతి చిహ్నాన్ని అందించారు. వేడకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
నేవీ డే కథ...
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4 పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేవీ డే వేడుకలు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఆర్‌కే బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

Published date : 05 Dec 2019 05:45PM