Skip to main content

విశాఖలో ఐ అండ్ సి సెంటర్

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఆగస్టు 4న ప్రతిపాదన పంపింది.
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే డ్రైవింగ్ పరీక్షలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటుకు ప్రతిపాదన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ
ఎక్కడ : గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Aug 2019 05:40PM

Photo Stories