Skip to main content

విన్సన్ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ

ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్(16,050)ను తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ డిసెంబర్ 26న అధిరోహించింది.
Current Affairsఏడు ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది పూర్ణ లక్ష్యం. ఇందులో విన్సన్ మాసిఫ్‌తో కలిపి ఇప్పటికే 6 పర్వతాలను అధిరోహించింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని ఐదేళ్ల కిందట 13 ఏళ్ల 11 నెలల వయస్సులోనే పూర్ణ అధిరోహించిన సంగతి తెలిసిందే. దీంతో అతి పిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన బాలికగా పూర్ణ రికార్డులకెక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విన్సన్ మాసిఫ్ పర్వతం అధిరోహణ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : మాలావత్ పూర్ణ
ఎక్కడ : అంటార్కిటికా ఖండం
Published date : 31 Dec 2019 05:36PM

Photo Stories