విక్రమ్ ల్యాండర్ దిగడంలో సమస్య
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విజయంపై సందిగ్ధత కొనసాగుతోంది.
తొలి నుంచి అన్నీ సవ్యంగానే జరిగినా.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీకి శివన్ ఈ విషయం తెలియజేశారు.
Published date : 07 Sep 2019 05:32PM