Skip to main content

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ

కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది.
Current Affairs

టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 6న ఆదేశాల‌ను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.


ఐసోలేషన్‌ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు

కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్‌ లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : సుప్రీంకోర్టు, హైకోర్టులు
ఎందుకు : కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) మహమ్మారి విజృంభిస్తోన్నందున‌

Published date : 07 Apr 2020 06:19PM

Photo Stories