Skip to main content

విద్యావ్యవస్థను సంస్కరించండి : సుప్రీంకోర్టు

వివిధ కోర్సుల అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు అధిక ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి లేకుండా చూడటం కోసం మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు జూన్ 4న ఆదేశించింది.
మహారాష్ట్రలో 2019-20 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు పడుతున్న దురవస్థ గురించి కోర్టు ప్రస్తావిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. మెడికల్ లేదా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల మెదళ్లలో అనిశ్చితి నెలకొంటోందని జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాల వేసవికాల సెలవుల ధర్మాసనం పేర్కొంది.

మహారాష్ట్రలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 14లోపు తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విద్యావ్యవస్థను సంస్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వివిధ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా
Published date : 05 Jun 2019 05:47PM

Photo Stories