వెయిట్‌లిఫ్టింగ్‌లో నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారుడు?
Sakshi Education
వెయిట్‌లిఫ్టింగ్‌లో జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 2021, ఆగస్టు 4న జరిగిన పురుషుల +109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో లాషా... మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్‌లో 200+క్లీన్ అండ్ జెర్క్‌లో 241)తో రజతాన్ని.... మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్‌లో 190+క్జీన్ అండ్ జెర్క్‌లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు.
హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్?
టోక్యో ఒలింపిక్స్–2020 హెప్టాథ్లాన్(ఏడు క్రీడాంశాల సమాహారం)లో బెల్జియం అథ్లెట్ నఫీ థియామ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆగస్టు 5న ముగిసిన ఈ పోటీలో థియామ్ 6791 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా అమెరికా దిగ్గజం జాకీ జాయ్‌నర్ కెర్సీ (1988 సియోల్, 1992 బార్సిలోనా) తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో హెప్టాథ్లాన్æలో స్వర్ణాలు నెగ్గిన రెండో క్రీడాకారిణిగా థియామ్ నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్ హెప్టాథ్లాన్‌లోనూ థియామ్ స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెయిట్‌లిఫ్టింగ్‌లో నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 4, 2021
ఎవరు : జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె(109 కేజీల విభాగం)
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2021లో మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తినందున...

Published date : 07 Aug 2021 12:40PM