వెర్‌స్టాపెన్ కు70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి టైటిల్
Sakshi Education
ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) విజేతగా నిలిచాడు.
ఇంగ్లండ్ లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో ఆగస్టు 9న జరిగిన ఈ రేసులో నిర్ణీత 52 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ గంటా 19 నిమిషాల 41.993సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో... వాల్తెరిబొటాస్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్ లో వెర్‌స్టాపెన్ కు ఇది తొలి విజయం కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో ఇది తొమ్మిదో ఎఫ్1 టైటిల్. ఈ సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన బొటాస్ నెగ్గగా... తర్వాతి మూడు రేసుల్లో హామిల్టన్(మెర్సిడెస్ జట్టు) చాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్)
Published date : 10 Aug 2020 06:08PM