వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు
Sakshi Education
భారత్‌లోని, విదేశాల్లోని విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొనే ‘వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్)’ వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సదస్సులో సుమారు 55 విదేశాల్లోని 3 వేల మంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, భారత్ లోని సుమారు 10 వేల మంది సైంటిస్ట్‌లు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... ‘శాస్త్ర రంగంలో భారత్‌కు ఘనమైన చరిత్ర ఉంది. దురదృష్టవశాత్తూ ఆధునిక కాలానికి ముందంతా చీకటి యుగమని ప్రస్తుత తరానికి అబద్ధాలు నూరిపోశారు’ అనిఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ స్టార్ట్‌అప్‌లకు సహకారం అందించాలని విదేశాల్లోని భారతీయులను కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : శాస్త్ర సాంకేతిక రంగంపై చర్చలు జరిపేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : శాస్త్ర సాంకేతిక రంగంపై చర్చలు జరిపేందుకు
Published date : 03 Oct 2020 05:58PM