Skip to main content

వైఎస్సార్ వేదాద్రి పథకానికి శంకుస్థాపన

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకా’నికి శంకుస్థాపన జరిగింది.
Current Affairs

ఈ ప్రాజెక్టుకు ఆగస్టు 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... 2021 ఏడాది ఫిబ్రవరి నాటికి వేదాద్రి పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు

  • కృష్ణా జిల్లాలోనినందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కోసం ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది.నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం.
  • ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం.
  • దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపం, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా
ఎందుకు : కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కోసం
Published date : 29 Aug 2020 05:18PM

Photo Stories