వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభమైంది.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూపొందించిన ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అక్టోబర్ 17న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి.
వైఎస్సార్ నవోదయం పథకం-ముఖ్యాంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు
వైఎస్సార్ నవోదయం పథకం-ముఖ్యాంశాలు
- బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తీర్చలేక నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారిన ఖాతాలతోపాటు మొండి బాకీలుగా మారేందుకు సిద్ధంగా ఉన్న (స్ట్రెస్డ్ అకౌంట్స్)ను ఆదుకునేలా వైఎస్సార్ నవోదయం పథకాన్ని రూపొందించారు.
- గరిష్టంగా రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది.
- మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించుకునేందుకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అవసరమైన ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ.2,00,000 వరకు సాయం చేయనున్నారు.
- ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80,000 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి.
- రుణాలు తీర్చలేని యూనిట్లను గుర్తించి వైఎస్సార్ నవోదయం పథకంలో చేర్చే బాధ్యతను కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకులకు ప్రభుత్వం అప్పగించింది.
- ఈ పథకంకింద ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేసింది.
- పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు
Published date : 17 Oct 2019 05:56PM