వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు ఉద్దేశించిన ‘మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం’ ప్రారంభమైంది.
కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో ఫిబ్రవరి 18న జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఫిబ్రవరి 18 నుంచి జూలై ఆఖరు వరకుమూడో విడత కంటి వెలుగు కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఎస్టీబీసీ కళాశాల, కర్నూలు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- కంటి వెలుగు కార్యక్రమం మొదటి దశ 2019, అక్టోబర్ 10న అనంతపురంలో ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారుల కోసం మొదలుపెట్టాం. 66 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం.
- 2019, నవంబర్ 1 నుంచి 31 వరకూ రెండోదశ కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేశారు. 500 మంది నిపుణులైన బృందాలతో 4.36 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.
- నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఐపీహెచ్‌ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) స్థాయికి తీసుకొస్తాం. మొదటగా కర్నూలు జిల్లా నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం.
- రాష్ట్రంలో ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీ (బోధనాసుపత్రి)లకు అదనంగా 16 కొత్త కాలేజీలు కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రతి ఆసుపత్రిలో పీజీ కోర్సులు వస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఎస్టీబీసీ కళాశాల, కర్నూలు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని వయో వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించేందుకు
Published date : 19 Feb 2020 06:02PM