Skip to main content

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణ

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తరించింది.
ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అక్టోబర్ 26న నాలుగు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019, నవంబరు 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లోని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో 17 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పొందవచ్చు. ఈ 17 సూపర్ స్పెషాలిటీ సేవల్లో భాగంగా 716 జబ్బులకు చికిత్స పొందవచ్చు.

17 సూపర్ స్పెషాలిటీ సేవలు-జబ్బులు

Current Affairs


ఆర్థికంగా చేయూత
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న తర్వాత రోగులు విశ్రాంతి పొందే సమయంలో ఉపాధి కోల్పోయే వారికి 2019, డిసెంబరు 1 నుంచి ఆర్థికంగా చేయూత అందించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చెల్లిస్తారు. ఈ సొమ్ము గరిష్టంగా రూ.5 వేల వరకు ఇస్తారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు పెన్షన్
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కల్పిస్తున్న పింఛను సౌకర్యం పరిధిని ప్రభ్తుత్వం విస్తరించింది. 2020 జనవరి 1 నుంచి నిర్దేశించిన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పింఛను ఇస్తారు. రక్తశుద్ధి చేయించుకునే వారికి ప్రస్తుతం నెలకు రూ.10వేల వంతున పింఛను ఇస్తున్నారు. తాజా ఉత్తర్వులతో మరికొందరికి ఈ పింఛను సౌకర్యం లభించింది.

Current Affairs


పారిశుధ్య కార్మికులకు వేతనం పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకూ నెలకు రూ.6,500 మాత్రమే పారిశుధ్య కార్మికులకు వేతనం ఇస్తుండగా..వారి వేతనం నెలకు రూ.16 వేలకు పెంచింది. పెంచిన వేతనాలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Current Affairs

Published date : 28 Oct 2019 05:51PM

Photo Stories