Skip to main content

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభమైంది.
Current Affairsగుంటూరు జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల
సీఎం తొలి చెక్కు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమెకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది.

ఆరోగ్య ఆసరా ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామన్నారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు.

జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు
ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తామని వెల్లడించారు. ‘తొలిదశలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది’ అని సీఎం తెలిపారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం.
  • 2020, ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం.
  • డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా 2020, జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం.
  • ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి 2020, జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం.
క్విక్ రివ్యూ :
 ఏమిటి :
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభం
 ఎప్పుడు  : డిసెంబర్ 2
 ఎవరు  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఎక్కడ  : గుంటూరు జనరల్ ఆసుపత్రి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
 ఎందుకు : చికిత్స తర్వాత రోగికి ఆర్థిక సాయం అందించేందుకు
Published date : 03 Dec 2019 06:23PM

Photo Stories