వాయుసేనలోకి చినూక్ ప్రవేశం
Sakshi Education
అమెరికాలో తయారైన నాలుగు చినూక్ సీహెచ్ 47ఎఫ్(ఐ) హెవీలిఫ్ట్ హెలికాప్టర్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు.
చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మార్చి 25న వీటిని వాయుసేనకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎయిర్‌చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా మాట్లాడుతూ... చినూక్ హెలికాప్టర్ల రాకతో వాయుసేన ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యం పెరిగిపోతుందని పేర్కొన్నారు.
2015లో 15 చినూక్ హెలికాప్టర్లను కొనుగోలుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా తొలి విడతలో నాలుగు హెలికాప్టర్లను అమెరికా అందజేసింది. అమెరికాలో ఫిలడెల్ఫియాలోని బోయింగ్ కర్మాగారంలో వీటిని తయారుచేశారు. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే చినూక్ హెలికాప్టర్లు దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను తీసుకెళ్లగలవు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి దోహదం చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లలో ఒకటిగా చినూక్ హెలికాప్టర్లు పేరొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత నాలుగు చినూక్ హెలికాప్టర్ల ప్రవేశం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : అమెరికాకి చెందిన బోయింగ్ సంస్థ
ఎక్కడ : ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, చండీగఢ్

Published date : 26 Mar 2019 05:51PM