వాయుసేన కోసం చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ?
జోధ్‌పూర్‌లోని డీఆర్‌డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా ‘అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్–118/ఐ’ను అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే రాడార్ నిర్దేశిత మిస్సైల్స్‌ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది.
స్టార్టప్ ఛాలెంజ్ 5.0 ప్రారంభం
రక్షణరంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఉద్దేశించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ 5.0’ ప్రారంభమైంది. ఆగస్టు 19న ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్షణరంగానికి సంబంధించిన నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్(ఐడెక్స్) పేరిట ఒక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాజ్‌నాథ్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్–118/ఐను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : డీఆర్‌డీఓ
ఎక్కడ : జోధ్‌పూర్(డీఆర్‌డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ), పుణే(డీఆర్‌డీఓ ప్రయోగశాల)
ఎందుకు : యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించడానికి...