Skip to main content

వాతావరణ శాస్త్రంపై భారతీయుల్లో విశ్వాసం

గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాస్త్రం పట్ల సగానికి సగం దేశాలు విశ్వాసం కోల్పోతున్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది.
Current Affairs అయితే భారతీయులు మాత్రం వాతావరణ శాస్త్రం పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నారని తెలిపింది. జనవరి 21న విడుదల చేసిన ‘ప్రపంచ వాతావరణ శాస్త్ర సర్వే’లో డబ్ల్యూఈఎఫ్ ఈ మేరకు పేర్కొంది. ఈ సర్వే ప్రకారం వాతావరణ శాస్త్రాన్ని నమ్మిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి.

ప్రపంచ వాతావరణ శాస్త్ర సర్వేను శాప్, క్వాలట్రిక్స్ సంస్థలతో కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహించింది. మొత్తం 30 దేశాల్లో, 10,500 మందిని ప్రశ్నించింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య 50వ వార్షిక సదస్సుని పురస్కరించుకొని ఈ అధ్యయనం చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వాతావరణ శాస్త్రంపై భారతీయుల్లో విశ్వాసం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)
Published date : 22 Jan 2020 06:21PM

Photo Stories