ఉత్తరాఖండ్‌లో జల విలయం
Sakshi Education
హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో దేవభూమి ఉత్తరాఖండ్‌లో జల విలయం సంభవించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జల విలయం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎక్కడ : చమోలీ జిల్లా, ఉత్తరాఖండ్
ఎందుకు : నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగి పడి... గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తడం కారణంగా...
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి ఫిబ్రవరి 7న హఠాత్తుగా మంచు చరియలు విరిగి పడ్డాయి. దీంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో దౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది.
జల విలయంతో తపోవన్-రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న తపోవన్-విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతింది. ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న కార్మికులు వరదల్లో, ప్రాజెక్టుల సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయారు. వారిలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు.
- తపోవన్-విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ధౌలీ గంగ నది(చమోలీ జిల్లా)పై ఉంది.
- రిషిగంగ హైడల్ ప్రాజెక్టు అలకనంద నదికి ఉపనది అయిన రిషి గంగ నదిపై(చమోలీ జిల్లా)పై ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జల విలయం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎక్కడ : చమోలీ జిల్లా, ఉత్తరాఖండ్
ఎందుకు : నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగి పడి... గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తడం కారణంగా...
Published date : 12 Feb 2021 12:04PM