Skip to main content

ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన అగ్రికల్చర్ ఇన్ ఇండియా పుస్తక రచయిత?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) మోహన్ కందా రచించిన ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్–ఇన్ ద కాంటెక్ట్స్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్’పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
Current Affairs
మార్చి 31న హైదరాబాద్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... కరోనా కాలంలో వ్యవసాయ ఉత్పత్తులను రికార్డు స్థాయిలో పండించి, మన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్న రైతులు కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్లేనని వ్యాఖ్యానించారు.

పోలూరి పురస్కారానికి ఆమోదం...
తన గురువు పోలూరి హనుమ జానకీరామ శర్మ పేరుతో తెలుగు భాషా పురస్కారం ఏర్పాటు చేసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆమోదం తెలిపారు.

కొన్ని పుస్తకాలు–రచయితలు

రచయిత

పుస్తకం

పిల్లలమర్రి పినవీరభద్రుడు

శృంగార శాకుంతలము

శ్రీ కృష్ణదేవరాయలు

ఆముక్త మాల్యద

అల్లసాని పెద్దన

మనుచరిత్రము

నంది తిమ్మన

పారిజాతాపహరణము

ధూర్జటి

కాళహస్తి మహాత్మ్యము

మొల్ల

మొల్ల రామాయణం

అయ్యలరాజు రామభద్రుడు

రామాభ్యుదయము

మాదయగారి మల్లన

రాజశేఖర చరిత్ర

తాళ్ళపాక చిన్నన్న

పరమయోగి విలాసము

పింగళి సూరన

కళాపూర్ణోదయము

సంకుసాల నృసింహకవి

కవికర్ణ రసాయనము

తెనాలి రామకృష్ణ

పాండురంగ మహాత్మ్యము

భట్టుకవి (రామరాజభూషణుడు)

వసుచరిత్ర

కందుకూరు రుద్రకవి

నిరంకుశోపాఖ్యానము

సారంగు తమ్మయ

వైజయంతీ విలాసము

విశ్వనాథనాయని స్థానాపతి

రాయ వాచకం

చేమకూరి వెంకటకవి

విజయ విలాసము

రంగాజమ్మ

మన్నారుదాస విలాసం

ముద్దు పళని

రాధికా సాంత్వనము

కంటింటి పాపరాజు

ఉత్తర రామాయణము

తరిగొండ వెంకమాంబ

వేంకటాచల మహాత్మ్యము


క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అగ్రికల్చర్‌ ఇన్‌ ఇండియా: కాం టెంపరరీ చాలెంజెస్‌–ఇన్‌ ద కాంటెక్ట్స్‌ ఆఫ్‌ డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కమ్‌ పుస్తాకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్‌
Published date : 01 Apr 2021 06:33PM

Photo Stories