ఉపాధి కూలీల వేతనం పెంపు
ప్రస్తుతం రూ.211గా ఉన్న గరిష్ట వేతనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ. 237కు పెరగనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆ ఏడాది వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు చెల్లించే వేతన రేట్లకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త కూలీ రేట్లతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్‌కుమార్ మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్ వివరాలు మార్చి 25న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చేరాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పనిచేసే కూలీలకు ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత నుంచి రోజుకు రూ.237 చొప్పున వేతనం చెల్లిస్తారు. కాగా, ఉపాధి హామీ పథకం అమలుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయన్న విషయం తెలిసిందే.
గత నాలుగేళ్లగా రాష్ట్రంలో ఉపాధి కూలీలకు చెల్లిస్తున్న రోజు వారీ వేతన రేట్లు :
ఏడాది | రోజు వారీ వేతనం రూ.లలో |
2017-18 | 197 |
2018-19 | 205 |
2019-20 | 211 |
2020-21 | 237 |