Skip to main content

ఉజ్వల 2.0 వంట గ్యాస్‌ పథకం ఎక్కడ ప్రారంభమైంది?

ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన(పీఎంయూవై)/‘ఉజ్వల’ 2.0 వంట గ్యాస్‌ పథకాన్ని ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించారు.
మహిళా లబ్ధిదారులకు వర్చువల్‌ పద్ధతిలో ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ సదుపాయాన్ని అందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కోటి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే.

ఉజ్వల 2.0 ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘ఉజ్వల పథకం తొలి దశలో 8కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. దేశవ్యాప్త ఎల్‌పీజీ గ్యాస్‌ కవరేజీ దాదాపు 100 శాతానికి దగ్గరవుతోంది. ఉజ్వల 2.0లో ఎలాంటి డిపాజిట్‌ తీసుకోకుండా కొత్త కనెక్షన్‌ ఇస్తున్నాం. మొదటి రీఫిల్‌ సిలిండర్, హాట్‌ప్లేట్‌ ఉచితంగా అందిస్తున్నాం’ అని చెప్పారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన(పీఎంయూవై)/‘ఉజ్వల’ 2.0 వంట గ్యాస్‌ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మహోబా, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు...
Published date : 11 Aug 2021 06:11PM

Photo Stories