ఉజ్బెకిస్తాన్ స్విమ్మింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారతీయుడు?
Sakshi Education
ఉజ్బెకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్ల పతకాల వేట కొనసాగుతోంది.
టోర్ని మూడో రోజు ఏప్రిల్ 15న భారత్‌కు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. ఉజ్బెకిస్తాన్ రాజధాని నగరం తాష్కెంట్‌లో ఈ టోర్ని జరుగుతోంది.
పతకాల విజేతలు–వివరాలు
పతకాల విజేతలు–వివరాలు
- పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 20 ఏళ్ల తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ స్వర్ణం గెలిచాడు. అతను 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
- మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. సువన భాస్కర్ ఖాతాలో రజతం చేరింది.
- పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్ ప్రకాశ్ (3ని:56.03 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఈ టోర్నీలోని సజన్‌కిది మూడో స్వర్ణం.
- మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని కటారియా స్వర్ణం పొందింది.
- మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చాహత్ అరోరా బంగారు పతకాన్ని ౖకైవసం చేసుకుంది.
- పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో లిఖిత్, ధనుశ్ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
Published date : 17 Apr 2021 04:37PM