Daily Current Affairs in Telugu: 2022, మార్చి 09 కరెంట్ అఫైర్స్
IT Minister KTR: మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
దేశీయంగా డిజిటల్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్‌లో మొదటి ఫేజ్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతుంది. ఈ విషయాలను మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి మార్చి 7న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు.
భారత్‌లో నాలుగోది..
మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం) తదితర సొల్యూషన్స్ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఆర్‌ఎం తదితర సొల్యూషన్స్ అందించేందుకు..
ISSF World Cup 2022: ప్రపంచకప్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారత జోడీ?
ఈజిప్ట్ రాజధాని నగరం కైరో వేదికగా మార్చి 7న ముగిసిన అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్–2022 టోర్నమెంట్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిథమ్ సాంగ్వాన్–అనీశ్ భన్వాలా జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. మార్చి 7న జరిగిన ఫైనల్లో రిథమ్–అనీశ్ ద్వయం 17–7తో చవీసా పాదుక–రామ్ ఖమాయెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది.
టాప్ ర్యాంక్‌లో భారత్..
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అనీశ్, గుర్‌ప్రీత్ సింగ్, భావేశ్ షెఖావత్‌లతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. ఫైనల్లో భారత జట్టు 7–17తో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్–2022 టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించిన భారత జోడీ?
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : రిథమ్ సాంగ్వాన్–అనీశ్ భన్వాలా జోడీ
ఎక్కడ : కైరో, ఈజిప్ట్
ఎందుకు : 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో రిథమ్–అనీశ్ ద్వయం 17–7తో చవీసా పాదుక–రామ్ ఖమాయెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచినందున..
Nari Shakti Puraskar: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్టమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన 29 మంది మహిళలకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నారీశక్తి పురస్కారాలు అందజేశారు. 2020, 2021 సంవత్సరాలకు గాను మార్చి 8న న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి పాములు పట్టే మహిళ వనిత జాగ్‌దేవ్ బొరాడె అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమె 50వేలకు పైగా పాముల్ని పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టారు. పాముకాటుకి గురైతే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ.. మహిళా సాధికారతతోనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయన్న ఉద్దేశంతో వివిధ రంగాల్లో ప్రత్యేకంగా కృషి చేసిన మహిళలకి నారీశక్తి పురస్కారాలను అందజేస్తోంది. వ్యవసాయం, విద్య, సాహిత్యం, కళలు, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సృజనాత్మకత, దివ్యాంగుల హక్కులు, వన్యప్రాణుల సంరక్షణ, ఎంట్రప్రెన్యుర్‌షిప్ రంగాల్లో అవిరళ కృషి చేసిన మహిళలకి అవార్డులు అందజేశారు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న కథక్ డ్యాన్సర్ సేలీ నందకిశోర్ అగ్వానే కూడా పురస్కారాన్ని అందుకున్నారు.
Nari Shakti Puruskar 2020 |
|||
Sl. No |
Name |
State/ UT |
Domain |
1. |
Anita Gupta |
Bihar |
Social Entrepreneur |
2. |
Ushaben Dineshbhai Vasava |
Gujarat |
Organic farmer & Tribal Activist |
3. |
Nasira Akhter |
Jammu & Kashmir |
Innovator - Environmental Conservation |
4. |
Sandhya Dhar |
Jammu & Kashmir |
Social Worker |
5. |
Nivruti Rai |
Karnataka |
Country Head, Intel India |
6. |
Tiffany Brar |
Kerala |
Social Worker – Working for Bli people |
7. |
Padma Yangchan |
Ladakh |
Revived the lost cuisine & clothin Leh region |
8. |
Jodhaiya Bai Baiga |
Madhya Pradesh |
Tribal Baiga Art Painter |
9. |
Saylee Nandkishor Agavane |
Maharashtra |
Down syndrome affected Kathak Dancer |
10. |
Vanita Jagdeo Borade |
Maharashtra |
First Women Snake Rescuer |
11. |
Meera Thakur |
Punjab |
Sikki Grass Artist |
12. |
Jaya Muthu, Tejamma (Jointly) |
Tamil Nadu |
Artisans - Toda embroidery |
13. |
Ela Lodh (Posthumous) |
Tripura |
Obstetrician & Gynecologist |
14. |
Arti Rana |
Uttar Pradesh |
Handloom Weaver & Teacher |
Nari Shakti Puruskar 2021 |
|||
1. |
Sathupati Prasanna Sree |
Andhra Pradesh |
Linguist – preserving minority tri languages |
2. |
Tage Rita Takhe |
Arunachal Pradesh |
Entrepreneur |
3. |
Madhulika Ramteke |
Chhattisgarh |
Social Worker |
4. |
Niranjanaben Mukulbhai Kalarthi |
Gujarat |
Author & Educationist |
5. |
Pooja Sharma |
Haryana |
Farmer & Entrepreneur |
6. |
Anshul Malhotra |
Himachal Pradesh |
Weaver |
7. |
Shobha Gasti |
Karnataka |
Social Activist – Working for end Devadasi system |
8. |
Radhika Menon |
Kerala |
Captain Merchant Navy – First w to receive award for Exceptional Bravery at Sea from IMO |
9. |
Kamal Kumbhar |
Maharashtra |
Social Entrepreneur |
10. |
Sruti Mohapatra |
Odisha |
Disability Rights Activist |
11. |
Batool Begam |
Rajasthan |
Maand & Bhajan Folk Singer |
12. |
Thara Rangaswamy |
Tamil Nadu |
Psychiatrist & Researcher |
13. |
Neerja Madhav |
Uttar Pradesh |
Hindi Author – working for right transgenders and Tibetan refugee |
14. |
Neena Gupta |
West Bengal |
Mathematician |
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, 2021 సంవత్సరానికి సంబంధించి.. 29 మంది మహిళలకు నారీశక్తి పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మహిళా సాధికారతతోనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయన్న ఉద్దేశంతో.. వివిధ రంగాల్లో ప్రత్యేకంగా కృషి చేసిన మహిళలను ప్రొత్సహించేందుకు..
Belgrade Indoor Meeting 2022: పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మోండో డుప్లాంటిస్ పోల్ వాల్ట్‌లో మార్చి 7న మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ జరగుతున్న 2022 బెల్‌గ్రేడ్ ఇండోర్ మీటింగ్ అథ్లెటిక్స్ టోర్నీలో 22 ఏళ్ల ఈ స్వీడన్ ప్లేయర్ 6.19 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో గ్లాస్గో టోర్నీలో 6.18 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా డుప్లాంటిస్‌కిది మూడో ప్రపంచ రికార్డు. 2022, మార్చి 18 నుంచి బెల్‌గ్రేడ్‌లోనే జరగనున్న ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో డుప్లాంటిస్ బరిలోకి దిగనున్నాడు.
ఐజేఎఫ్ నుంచి తొలగింపుకు గరైన దేశాధ్యక్షుడు?
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ సమాజమంతా గుర్రుగా ఉంది. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) పుతిన్‌ను వెలివేసింది. ఆయన ఐజేఎఫ్‌లో గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందే పుతిన్‌ను సస్పెండ్ చేసిన ఐజేఎఫ్ ఇప్పుడు ఆయనను శాశ్వతంగా తొలగించింది. పుతిన్ సన్నిహితుడు ఆర్కడి రోటెన్‌బర్గ్‌ను సైతం ఐజేఎఫ్ విడిచి పెట్టలేదు. ఐజేఎఫ్ అన్ని హోదాల నుంచి వీరిద్దరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మోండో డుప్లాంటిస్
ఎక్కడ : బెల్‌గ్రేడ్ ఇండోర్ మీటింగ్ అథ్లెటిక్స్ టోర్నీ, బెల్‌గ్రేడ్, సెర్బియా
ఎందుకు : పోల్ వాల్ట్ ఈవెంట్‌లో డుప్లాంటిస్ 6.19 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో..
National Award: తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్సార్ జిల్లా, వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగుండటంతో ఈ అవార్డు దక్కింది. మార్చి 8న న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మరియు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా మైనింగ్ మేనేజర్ కమలాకరరావు, లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ అంకిరెడ్డిలు అవార్డును అందుకున్నారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
వైఎస్సార్ జిల్లా కలమల్ల సమీపంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)కు జాతీయస్థాయి భద్రతా పురస్కారం లభించింది. మార్చి 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నుంచి ఏపీ జెన్‌కో డైరెక్టర్ (థర్మల్) చంద్రశేఖర్‌రాజు దీనిని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు జాతీయస్థాయి అవార్డు ప్రదానం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మరియు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగుండటంతో..
IT Minister KTR: ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు ఉద్దేశం?
మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం
సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ుహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉద్యమిక పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ఎందుకు : మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు..
Russia-Ukraine war: నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
రష్యా, ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో–NATO) సభ్యత్వంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. తమ దేశం ఇక ఎంతమాత్రం నాటో సభ్యత్వం కోసం ఆశించదని మార్చి 8న ప్రకటించారు. దీంతో ఒక సున్నితమైన అంశంపై స్పష్టత వచ్చినట్లయింది. జెలెన్‌స్కీ ప్రకటనపై రష్యా స్పందించాల్సిఉంది. నాటో సభ్యత్వం వద్దనుకోవడంతో పాటు వివాదాస్పద డొనెట్‌స్క్, లుహాన్స్‌క్ ప్రాంతాల సార్వభౌమత్వ అంశంపై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. 1949, ఏప్రిల్ 4న ఏర్పాటైన నాటో కూటమి ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉంది. దీని ప్రధాన ఉద్దేశం: సభ్యదేశాల భద్రత కోసం ఉమ్మడి రక్షణ వ్యవస్థ ఏర్పాటు. ప్రస్తుతం ఈ కూటమిలో 30 సభ్య దేశాలు ఉన్నాయి.
సభ్య దేశాలు |
చేరిన సంవత్సరం |
యునైటెడ్ స్టేట్స్ |
1949 |
యునైటెడ్ కింగ్‌డమ్ |
1949 |
పోర్చుగల్ |
1949 |
నార్వే |
1949 |
ఐస్లాండ్ |
1949 |
నెదర్లాండ్స్ |
1949 |
లక్సెంబర్గ్ |
1949 |
ఇటలీ |
1949 |
ఫ్రాన్స్ |
1949 |
డెన్మార్క్ |
1949 |
కెనడా |
1949 |
బెల్జియం |
1949 |
టర్కీ |
1952 |
గ్రీస్ |
1952 |
జర్మనీ |
1982 |
స్పెయిన్ |
1955 |
పోలాండ్ |
1999 |
హంగేరి |
1999 |
చెక్ రిపబ్లిక్ |
1999 |
స్లోవేకియా |
2004 |
స్లోవేనియా |
2004 |
రొమేనియా |
2004 |
లిథువేనియా |
2004 |
లాట్వియా |
2004 |
ఎస్టోనియా |
2004 |
బల్గేరియా |
2004 |
క్రొయేషియా |
2009 |
అల్బేనియా |
2009 |
ఉత్తర మాసిడోనియా |
2020 |
మోంటెనెగ్రో |
2017 |
రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోమారు ప్రకటించింది. అయితే హ్యుమానిటేరియన్ కారిడార్ల పేరిట పౌరుల తరలింపునకు రష్యా పేర్కొన్న మార్గాల్లో అత్యధికం రష్యా, బెలారస్‌కు దారితీయడంపై ఉక్రెయిన్ అభ్యంతరాలు వెల్లడించింది.
పుతిన్, జెలెన్‌స్కీలకు మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భారత ప్రధానమంత్రి మోదీ మార్చి 7న ఫోన్‌లో విడివిడిగా సంభాషించారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని వారిని మోదీ కోరారు. పుతిన్, జెలెన్‌స్కీ నేరుగా చర్చలు జరపాలని, అప్పుడే శాంతియత్నాలు జోరందుకుంటాయని సూచించారు. ఉక్రెయిన్ నుంచి 20వేల మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించడంలో సాయపడినందుకు జెలెన్‌స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 07 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్