Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 15 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-15

Handball: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు?

India Handball team

భారత మహిళల హ్యాండ్‌బాల్‌ జట్టు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించింది. కజకిస్తాన్‌లోని అల్మాటిలో జరిగిన ఆసియా మహిళల జూనియర్‌ చాంపియన్‌షిప్‌-2022లో భారత్‌ విజేతగా నిలవడం ద్వారా మెగా టోర్నీకి అర్హత పొందింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ అగ్ర స్థానంలో నిలిచింది. మార్చి 14న జరిగిన ఆఖరి నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు 41–18తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, థాయ్‌లాండ్‌లపై నెగ్గగా, ఇరాన్‌ చేతిలో ఓడింది. తద్వారా 6 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. 2022 ఏడాది స్లొవేనియాలో జూన్‌ 22 నుంచి జూలై 3 వరకు జరిగే మహిళల జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తలపడనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా మహిళల జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌-2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : భారత జట్టు
ఎక్కడ    : అల్మాటి, కజకిస్తాన్‌
ఎందుకు : ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచినందున..

Air India Board: ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?

N Chandrasekaran

ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. ఎయిర్‌ ఇండియా బోర్డ్‌ ఈ మేరకు ఆయనకు ఈ కొత్త పదవి అప్పగించినట్టు సమాచారం. సీఈవో, ఎండీ నియామకం ఇంకా చేపట్టాల్సి ఉంది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చైర్మన్‌ ఇల్కర్‌ ఐజును ఎయిర్‌ ఇండియా సీఈవో, ఎండీగా  టాటా సన్స్‌ ప్రకటించింది. పాకిస్తాన్‌ మిత్రదేశమైన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఐజు సన్నిహితుడు. దీనిపై తలెత్తిన విమర్శల నేప థ్యంలో తన నియమకాన్ని ఐజు తిరస్కరించారు.

ఐఆర్‌డీఏఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి?  
భారత బీమా, నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చీఫ్‌గా దేవాశిష్‌ పాండా మార్చి 14న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బీమా రంగ రెగ్యులేటర్‌ చైర్మన్‌గా వారం క్రితం దేవాశిష్‌ను నియమిస్తున్నట్లు మార్చి 11వ తేదీన కేంద్రం ప్రకటించింది. పాండా గతంలో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన పాండా, ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందినవారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌  
ఎందుకు : ఎయిర్‌ ఇండియా బోర్డ్‌ నిర్ణయం మేరకు..​​​​​​​PLFS: ఎన్‌ఎస్‌వో సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు?

Unemployment rate

దేశంలో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) 12.6 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగ రేటు కరోనా కారణంగా 20.8 శాతానికి పెరిగిపోవడంతో.. అక్కడి నుంచి తగ్గినట్టు కనిపిస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) మార్చి 14న విడుదల చేసిన ‘11వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పనిచేయగలిగి ఉండి, ఉపాధి లేకుండా ఉన్న వారిని నిరుద్యోగ రేటు కింద పరిగణిస్తారు. 15 ఏళ్లు అంతకుమించి వయసులోని వారిని ఈ గణాంకాల కిందకు ఎన్‌ఎస్‌వో పరిగణనలోకి తీసుకుంటోంది.

తాజా గణాంకాలు వివరంగా..

  • పట్టణాల్లో మహిళల నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్‌ – జూన్‌ కాలంలో 21.1 శాతంగా ఉంటే, 2021 ఏప్రిల్‌–జూన్‌ కాలానికి 14.3 శాతానికి దిగొచ్చింది. కానీ అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. 2021 జనవరి–మార్చిలో ఇది 11.8 శాతంగా ఉంది.
  • పురుషుల్లో ఈ రేటు 20.7 శాతం నుంచి 12.2 శాతానికి తగ్గింది. 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 9.6 శాతంగా ఉండడం గమనార్హం.  
  • కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్‌–జూన్‌ కాలానికి 46.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఉన్న 45.9 శాతంతో చూస్తే స్వల్పంగా పెరిగింది. అంటే ఈ మేరకు పనిచేసే మానవవనరులు పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. కానీ 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 47.5 శాతంగా ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) నిరుద్యోగ రేటు 12.6 శాతంగా నమోదైంది
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన ‘11వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)
ఎక్కడ : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో..

Covid-19: కోర్బివాక్స్‌ టీకాను తయారు చేసిన సంస్థ?

Corbevax Vaccine

దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఈ. లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన ‘‘కోర్బివాక్స్‌’’ టీకా ఇవ్వనున్నట్లు మార్చి 14న తెలిపారు. 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు మార్చి 16వ తేదీ నుంచి కరోనా టీకా తీసుకోవాలని కోరారు. అలాగే రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారు కూడా బూస్టర్‌ డోసు వేయించుకోవచ్చని సూచించారు.

7.11 కోట్ల మంది..
12–14 ఏళ్ల వయసు విభాగంలో దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్‌ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దేశంలో 14 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15–18 ఏళ్ల వారికి 2022, జనవరి 3వ తేదీ నుంచి కరోనా టీకాలు ఇస్తున్నారు.

చైనాకు స్టెల్త్‌ ఒమిక్రాన్‌ దడ
చైనా ప్రభుత్వానికి స్టెల్త్‌ ఒమిక్రాన్‌ (ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌) దడ పుట్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో చైనాలో 1,337 కొత్త కేసులు నిర్థారణ కాగా ఇందులో ఒక్క జిలిన్‌ ప్రావిన్స్‌లోనివే 895 వరకు ఉన్నాయి. దీంతో ఈశాన్యప్రాంతంలో ఉన్న జిలిన్‌ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలెవరూ కారణం లేకుండా ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. అసలు కరోనా వైరస్‌ కన్నా, ఇతర వేరియంట్ల కన్నా స్టెల్త్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌(కోర్బివాక్స్‌ టీకా) మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : కోవిడ్‌ వైరస్‌ నియంత్రణ కోసం..

Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గ్రామీనర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు?

Gramener’s New Center at Hyderabad

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన కంపెనీ ‘గ్రామీనర్‌’ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభమైంది. మార్చి 14న ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో డేటాసైన్స్‌ రంగం వేగంగా పుంజుకుంటోందని.. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్రామినర్‌ ప్రస్థానం 2010లో ప్రారంభమైందని, ఇక్కడ మొట్టమొదటి డేటా సైన్స్‌ అండ్‌ స్టోరీ టెల్లింగ్‌ కంపెనీ తమదేనని సంస్థ సహ వ్యవస్థాపకుడు నవీన్‌ గట్టు చెప్పారు.

శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి..
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని సభ్యులకు సూచించారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్‌ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గ్రామీనర్‌ కంపెనీ ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతం, హైదరాబాద్‌

Mauritius Govt: మారిషస్‌ స్టార్‌ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి?

Sanjeeva Narasimha Appadu

మారిషస్‌ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది ప్రముఖులను ఈ పురస్కారానికి అక్కడి ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ చేతుల మీదుగా  సంజీవ నరసింహ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలలో సామాజిక పురోగతికి కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డులను అందజేస్తారు.

మారిషస్‌..
రాజధాని:
పోర్ట్‌ లూయిస్‌; కరెన్సీ: మారిషస్‌ రుపీ
ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌
ప్రస్తుత ప్రధానమంత్రి: ప్రవింద్‌ జగన్నాథ్‌ 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మారిషస్‌ ప్రభుత్వం అందించే ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : సంజీవ నరసింహ అప్పడు
ఎందుకు : హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలలో సామాజిక పురోగతికి కృషి చేసినందున..

International Arbitration Center: రాష్ట్రంలోని ఏ నగరంలో ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేశారు?

IAMC-Hyderabad

అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం ఉద్దేశించిన.. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్‌ రమణ మార్చి 12న భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పాల్గొన్నారు.

వైరాలో ఇండోర్‌ స్టేడియం, బోటింగ్‌ ప్రారంభం
ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్‌ బోట్లను మార్చి 13న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి భూమిపూజ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
ఎక్కడ    : గచ్చిబౌలి, హైదరాబాద్‌
ఎందుకు : అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం..

Telugu Lyricist: ప్రముఖ పాటల రచయిత కందికొండ ఇకలేరు

Kandikonda Yadagiri

ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 12న హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మ దంపతులకు కందికొండ జన్మించారు. మానుకోటలో ఇంటర్‌ పూర్తి చేసి, మహబూబాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీతదర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇ¯Œ స్టిట్యూట్‌ ప్రారంభించారు. పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్న కందికొండ.. 1997– 98లో మిస్టర్‌ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్‌ పూర్తి చేసిన కందికొండ.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో గేయరచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ కవి, పాటల రచయిత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 12
ఎవరు    : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : కేన్సర్‌ కారణంగా..​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Mar 2022 07:35PM

Photo Stories