Skip to main content

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్‌కు టైటిల్

థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్‌లో భారత్‌కు టైటిల్ లభించింది.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆగస్టు 4న జరిగిన పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి ఈ టైటిల్ సాధించారు. ఫైనల్లో అన్‌సీడెడ్ సాయిరాజ్-చిరాగ్ (భారత్) జంట 21-19, 18-21, 21-18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్-లియు యు చెన్ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. దీంతో సూపర్-500 స్థాయి టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా సాయిరాజ్-చిరాగ్ జంట గుర్తింపు పొందింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్‌లో భారత్‌కు టైటిల్
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
Published date : 05 Aug 2019 05:43PM

Photo Stories