థార్ ఎక్స్‌ప్రెస్, లాహోర్ బస్ నిలిపివేత
Sakshi Education
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య నడిచే థార్ ఎక్స్‌ప్రెస్ రైలును, ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సర్వీసును పాకిస్తాన్ నిలిపివేసింది.
ఈ విషయాన్ని పాక్ సమాచార శాఖ మంత్రి మురాద్ సయీద్ ఆగస్టు 9న ప్రకటించారు. అయితే థార్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేతకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని భారత రైలే్వైశాఖ జోధ్‌పూర్ డివిజన్ అధికార ప్రతినిధి గోపాల్‌శర్మ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ థార్ ఎక్స్‌ప్రెస్, లాహోర్ బస్‌ను నిలిపివేసింది. ఇప్పటికే సంరతా ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్తాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే.

Published date : 10 Aug 2019 07:44PM