Skip to main content

తస్నిమ్‌కు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్

భారత అమ్మాయి తస్నిమ్ మీర్‌కు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది.
Current Affairsఅండర్-15 బాలికల సింగిల్స్ విభాగంలో తస్నిమ్ మీర్ విజేతగా అవతరించింది. ఇండోనేసియాలోని సురబాయలో డిసెంబర్ 15న జరిగిన ఫైనల్లో తస్నిమ్ మీర్ 17-21, 21-11, 21-19తో భారత్‌కే చెందిన తారా షాపై విజయం సాధించింది. గుజరాత్‌కు చెందిన 13 ఏళ్ల తస్నిమ్ 2019 ఏడాది జనవరిలో ఖేలో ఇండియా గేమ్స్‌లో అండర్-17 సింగిల్స్ విభాగంలో స్వర్ణం నెగ్గింది. అలాగే 2018 ఏడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన రెడ్డితో కలిసి అండర్-15 డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : తస్నిమ్ మీర్
ఎక్కడ : సురబాయ, ఇండోనేసియా
Published date : 16 Dec 2019 05:47PM

Photo Stories