టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంస్థ?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా మొబైల్ గేమింగ్ సంస్థ ‘ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్’ వ్యవహరిస్తుంది.
ఈ మేరకు ఎంపీఎల్‌తో దాదాపు ఏడాదిన్నర కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా జూన్ 17న తెలిపారు. 2022, డిసెంబర్ 31 వరకు ఉండే ఈ ఒప్పందంలో భాగంగా 2022 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు కూడా ఎంపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఒప్పందం ప్రకారం అథ్లెట్లకు స్పోర్ట్స్ కిట్‌ను పంపిణీ చేసే ఆ సంస్థ ఐఓఏకు రూ. 8 కోట్లు చెల్లిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2021లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంస్థ?
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో కుదిరిన ఒప్పందం మేరకు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2021లో భారత బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంస్థ?
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో కుదిరిన ఒప్పందం మేరకు...
Published date : 18 Jun 2021 06:00PM