తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
Sakshi Education
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు(సీజే) రానున్నారు.
వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయిది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. డిసెంబర్ 16న సిఫారసుల జాబితాను సుప్రీంకోర్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్ఎఫ్ నారీమన్, యు.యు.లలిత్, ఏఎం ఖన్విల్కల్కర్ లతో కూడిన కొలీజియం ఈ సిఫారసులు చేసింది. కొలీజియం సిఫార్సుల ప్రకారం...
సీజేల బదిలీలు
న్యాయమూర్తుల బదిలీలు
సీజేగా పదోన్నతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్ఎఫ్ నారీమన్, యు.యు.లలిత్, ఏఎం ఖన్విల్కల్కర్ లతో కూడిన కొలీజియం ఈ సిఫారసులు చేసింది. కొలీజియం సిఫార్సుల ప్రకారం...
సీజేల బదిలీలు
ప్రధాన న్యాయమూర్తి పేరు | ప్రస్తుత హైకోర్టు | బదిలీ స్థానం |
జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి | సిక్కిం | ఆంధ్రప్రదేశ్ |
జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి | ఆంధ్రప్రదేశ్ | సిక్కిం |
జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ | తెలంగాణ | ఉత్తరాఖండ్ |
జస్టిస్ మహమ్మద్ రఫీఖ్ | ఒడిశా | మధ్యప్రదేశ్ |
న్యాయమూర్తి పేరు | ప్రస్తుత హైకోర్టు | బదిలీ స్థానం |
జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి | కలకత్తా | ఆంధ్రప్రదేశ్ |
జస్టిస్ సంజయ్యాదవ్ | మధ్యప్రదేశ్ | అలహాబాద్ |
జస్టిస్ రాజేష్ బిందాల్ | జమ్మూ కశ్మీర్ | కలకత్తా |
జస్టిస్ వినీత్ కొఠారి | మద్రాస్ | గుజరాత్ |
జస్టిస్ సతీష్ చంద్రశర్మ | మధ్యప్రదేశ్ | కర్ణాటక |
న్యాయమూర్తి పేరు | ప్రస్తుత హైకోర్టు | బదిలీ స్థానం |
జస్టిస్ హిమా కోహ్లి | ఢిల్లీ | తెలంగాణ |
జస్టిస్ ఎస్.మురళీధర్ | పంజాబ్, హరియాణా | ఒడిశా |
జస్టిస్ సంజీబ్ బెనర్జీ | కలకత్తా | మద్రాస్ |
జస్టిస్ పంకజ్ మిత్తల్ | అలహాబాద్ | జమ్మూ కశ్మీర్ |
జస్టిస్ సుధాంశు ధులియా | ఉత్తరాఖండ్ | గౌహతి |
Published date : 17 Dec 2020 06:32PM