Skip to main content

తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి కన్నుమూత

దేశంలో తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆగస్టు 26న ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా ఎంపికై చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. 33 ఏళ్ల వృత్తి జీవితంలో పలు సమస్యాత్మక కేసులను ఆమె పరిష్కరించారు. జాతీయ బ్యాడ్మింటన్ చాంిపియన్ సయ్యద్ మోదీ హత్యతోపాటు రిలయన్స్-బాంబే డైయింగ్ కేసులు ఇందులో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తొలి మహిళా డీజీపీ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కాంచన్ చౌదరి భట్టాచార్య (72)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 28 Aug 2019 05:41PM

Photo Stories