తొలి ద్రోణాచార్య అవార్డు అందుకున్న అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్?
పీటీ ఉషను పరుగుల రాణిగా తీర్చిదిద్దిన ఆయన వృద్ధాప్య రుగ్మతలతో కోజికోడ్ జిల్లా వడకర పట్టణంలోని స్వగృహంలో ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు. 1985లో తొలి ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న ఆయనకు 2021 ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.
1932, ఫిబ్రవరి 16న జన్మించిన నంబియార్ కోజికోడ్‌లోని గురువాయురప్పన్ కాలేజీలో అథ్లెట్‌గా విజయాలు సాధించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (పాటియాలా)లో డిప్లొమా చేసిన ఆయన తదనంతరం కోచ్‌గా పనిచేశారు. భారత ఎయిర్‌ఫోర్స్‌కు 15 ఏళ్ల పాటు సేవలందించి 1970లో రిటైరయ్యారు. పీటీ ఉష, షైనీ విల్సన్, వందన రావు సహా చాలామంది యువతకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో కోచింగ్ ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఒ.ఎమ్.నంబియార్(ఓథయోతు మాధవన్ నంబియార్)(89)
ఎక్కడ : వడకర పట్టణం, కోజికోడ్ జిల్లా, కేరళ
ఎందుకు : వృద్ధాప్య రుగ్మతల కారణంగా...