Skip to main content

తమిళనాడులో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు

తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిలో రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.
Current Affairsఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించి...
శ్రీ హరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో రెండు లాంచింగ్ ప్యాడ్ (1,2)లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు లాంచింగ్ ప్యాడ్‌లు అవసరమని భావిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అనువైన భూమికోసం అన్వేషించారు. తూత్తుకూడి జిల్లా తిరుచెందూరుకు సమీపంలోని కులశేఖరపట్టి అనుకూలమని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కులశేఖరపట్టిలో 3, 4 లాంచింగ్ ప్యాడ్‌లను నిర్మించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

భూమధ్య రేఖకు అతి సమీపంలో...
కులశేఖరపట్టి భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉంది. శ్రీహరికోట కేంద్రంలోని భూమికి గరిష్టంగా 1,350 కిలోల బరువైన వాహక నౌకను ప్రయోగించగల సామర్థ్యం ఉండగా, కులశేఖరపట్టి వద్ద భూమికి 1,800 కిలోల బరువును తట్టుకోగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలిదశగా కులశేఖరపట్టి పరిధిలోని మూడు గ్రామాల్లో 2,300 ఎకరాల భూ సేకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ అంతరిక్ష కేంద్రం ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : కులశేఖరపట్టి, తూత్తుకూడి జిల్లా, తమిళనాడు
Published date : 09 Dec 2019 06:00PM

Photo Stories