Skip to main content

Taliban in Afghanistan: ద అఫ్గానిస్తాన్‌ బ్యాంక్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు పలువర్గాలతో చర్చలు జరుపుతున్న తాలిబన్లు... మరోవైపు నియామకాలు మొదలుపెట్టారు. ఆగస్టు 24న పలువురిని కీలక పదవుల్లో నియమించారు.
గుల్‌ ఆగాను ఆర్థికమంత్రిగా, నజీబుల్లాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, సాద్ర్‌ ఇబ్రహీంను తాత్కాలిక హోంమంత్రిగా, ముల్లా షిరీన్‌ను కాబూల్‌ గవర్నర్‌గా, హమీదుల్లాని కాబూల్‌ మేయర్‌గా ప్రకటించారు. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు... ద అఫ్గానిస్తాన్‌ బ్యాంక్‌ తాత్కాలిక చీఫ్‌గా హాజీ మొహమ్మద్‌ ఇద్రిస్‌ను తాలిబన్లు నియమించారు. ఈ విషయాలను ‘పజ్వోఖ్‌ అఫ్గాన్‌ న్యూస్‌’ వార్తాసంస్థ తెలిపింది.

బరాదర్‌తో సీఐఏ డైరెక్టర్‌ భేటీ
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్‌ విలియం జె.బర్న్స్‌ ఆగస్టు 23న తాలిబన్ల రాజకీయ విభాగ నేత అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన కాబూల్‌ను ఆక్రమించాక తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి ముఖాముఖి భేటీ ఇదే.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ద అఫ్గానిస్తాన్‌ బ్యాంక్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : హాజీ మొహమ్మద్‌ ఇద్రిస్‌
ఎందుకు : అఫ్గాన్‌లో ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి...
Published date : 25 Aug 2021 06:56PM

Photo Stories