Skip to main content

టిక్‌టాక్, వీ చాట్‌లపై నిషేధం విధించిన ఉత్తర అమెరికా దేశం?

జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్‌లను నిషేధిస్తూ సెప్టెంబర్ 18న ఉత్తర అమెరికా దేశం యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆదేశాలు జారీచేసింది.
Current Affairs
సెప్టెంబర్ 20 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్‌బుర్ రాస్ తెలిపారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు రాస్ పేర్కొన్నారు.

ఆగస్టులోనే సంతకం...
2020, సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.

చదవండి: భారత్ నిషేధించిన చైనా యాప్‌లు-వివరాలు

క్విక్ రివ్యూ :
ఏమిటి : టిక్‌టాక్, వీ చాట్‌లపై నిషేధం విధించిన ఉత్తర అమెరికా దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ఎందుకు : జాతీయ భద్రతను కాపాడటానికి
Published date : 19 Sep 2020 04:53PM

Photo Stories