Skip to main content

టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త?

కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ(సీటీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. శ్రీధర్‌కు ‘టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డు’ లభించింది.
Edu news
చీడపీడల నివారణలో విశేష కృషి చేసినందుకుగాను శ్రీధర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెన్నైలోని డాక్టర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ ప్రకటించింది. 2020, డిసెంబర్ 5న చెన్నైలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ ఈ అవార్డును అందుకోనున్నారు.

ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ కృష్ణా జిల్లా గుడివాడకు సమీపంలోని గురజ గ్రామంలో జన్మించారు. నైనిటాల్‌లోని జీబీ పంత్ వ్యవసాయ వర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పత్తి, మిర్చి, కంది, పొగాకు, వేరుశనగలలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ప్రవేశపెట్టి పురుగుమందుల అవశేషాల తగ్గింపునకు విశేష కృషి చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : సీటీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. శ్రీధర్
ఎందుకు : చీడపీడల నివారణలో విశేష కృషి చేసినందుకుగాను
Published date : 16 Oct 2020 06:13PM

Photo Stories