టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని కోట్ల ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 78 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం కొనసాగుతున్న టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఇందుకోసం రాష్ట్ర పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) రూ.2,679.76 కోట్లతో తాజాగా రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆయా గృహ సముదాయాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, పార్కులు, కమ్యూనిటీ హాలు తదితర మౌలిక వసతులు సమకూర్చనుంది. ప్రభుత్వ ఆమోదం నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించాలని టిడ్కో భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో వాటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదానికి పంపించనున్నారు. పట్టణ పేదలకు గృహ వసతి కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టులు కాబట్టి ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఎస్‌ఈసీ అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ చేపట్టాలని, ఏడాదిన్నరలో పనులు పూర్తి చేయాలనే భావనలో టిడ్కో ఉంది.
Published date : 18 Feb 2021 05:30PM