తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం
Sakshi Education
డిజిటల్ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్థాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘సైబర్ రక్షక్’ పథకాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మార్చి 18న హైదరాబాద్‌లో ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ అనర్థాలు అరికట్టడంలో శిక్షణ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షి’ టీంల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్‌జ (టాస్క్) సహకారంతో ఎండ్ నౌ ఫౌండేషన్ సైబర్ రక్షక్ పథకాన్ని రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : సైబర్ నేరాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : సైబర్ నేరాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు
Published date : 19 Mar 2019 05:07PM